'నగరంలో తాగునీటి కొరత ఉండొద్దు'
HYD నగర పరిధిలో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడ తాగునీటి కొరత ఉండొద్దని, కలుషిత నీటి సరఫరా సమస్యలు తలెత్తిన చోట్ల ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలన్నారు.