దానిని రద్దు చేసినందుకు గర్వపడుతున్నా: ట్రంప్
అమెరికాకు ఇప్పటికీ ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో మాజీ అధ్యక్షుడు ఒబామా చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినందుకు గర్వపడుతున్నానని వెల్లడించారు. ఒప్పందం కొనసాగి ఉంటే టెహ్రాన్ ఇప్పటికే అణ్వాయుధాలను కలిగి ఉండేదన్నారు. అలా జరిగి ఉంటే ప్రపంచానికి ఇరాన్ పెను ముప్పుగా మారేదని చెప్పారు.