వర్షం కారణంగా దెబ్బతిన్న 40 ఎకరాల మిర్చి పంట

వర్షం కారణంగా దెబ్బతిన్న 40 ఎకరాల మిర్చి పంట

ప్రకాశం: హనుమంతుడుపాడు మండలం నారాయపల్లి, రంగంపేట గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి తోడు వడగళ్ల వాన కూడా పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు పిక్కిలి పోలయ్య, బుడ్డా రెడ్డి వారి సుమారు 40 ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంట పూర్తిగా దెబ్బతింది. ఆకస్మికంగా కురిసిన వడగళ్ల వాన వల్ల పంట నేలమట్టమై రైతులు ఆందోళనకు గురయ్యారు.