'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

KMM: మధిర పట్టణంలోని ఎంపీ రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు డీసీసీ కార్యదర్శి అప్పారావు, జిల్లా నాయకులు ఆనంద్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీ రేణుక చౌదరి సిఫార్సు మేరకు మంజూరైన రూ.87,500 విలువగల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.