హనుమాన్ దీక్ష ధరించిన ముస్లిం యువకుడు

హనుమాన్ దీక్ష ధరించిన ముస్లిం యువకుడు

TG: మత సామరస్యానికి ప్రతీకగా జగిత్యాల జిల్లా పూడూరుకు చెందిన మహమ్మద్ యూసఫ్ 11 రోజుల పాటు హనుమాన్ దీక్షను నిష్టతో చేపట్టారు. గత ఏడాది రోడ్డు ప్రమాదం నుంచి శ్రీరాముడి కృపతోనే ప్రాణాలతో బయటపడ్డాననే నమ్మకంతో ఆయన ఈ దీక్షను స్వీకరించారు. హనుమాన్ జయంతి రోజున కొండగట్టు అంజన్న సన్నిధిలో మాల విరమణ చేసి, భక్తికి మతం అడ్డుకాదని యూసఫ్ చాటిచెప్పారు.