రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కృష్ణా: కృతివున్ను (M) గరిశపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. ప.గో (D) మొగళ్తూరు (M) పేరుపాలెం దిబ్బలపలాలెంకు చెందిన బాలబాపూజీ (45), కుమారుడు కార్తీక్‌తో విజయవాడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాపూజీ మృతి చెందగా, కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.