డీఆర్డీఏ ఇన్‌ఛార్జి పీడీ నియామకం

BPT: డీఆర్డీఏ ఇన్‌ఛార్జి పీడీగా సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా డీఆర్డీఏ పీడీగా కొనసాగుతున్న శ్రీనివాస్ ట్రైనింగ్ నిమిత్తం వారం రోజులు సెలవుపై వెళ్ళారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి పీడీగా సుబ్బారావును నియమిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.