VIDEO: భూ భారతి సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం

SRPT: తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని శనివారం రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. చింతలపాలెం మండల కేంద్రంలో భూ భారతి సదస్సును నిర్వహించారు. నాగరాజు అనే రైతు తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్ను మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు రైతును పక్కకు తీసుకెళ్లి కాపాడారు.