'స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'
MHBD: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆమె కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.