మరికల్‌లో పంచాంగ శ్రవణం
NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని చేశారు. పరాభవ సంవత్సరంలో అందరికి శుభం కలగాలని, పాడి పంటలతో కళకళలాడాలని అన్నారు. అనంతరం దసరా కట్ట దగ్గర కాషాయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.