ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో PM మోదీ త్రివిధ దళాల అధిపతులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం PM నివాసంలో జరిగింది. ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. అంతకుముందు NSA అజిత్ దోవల్‌తోనూ మోదీ భేటీ అయ్యారు.