బైక్‌ను ఢీకొన్న బస్సు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

KMM: బోనకల్ మండలం కలకోట చర్చి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బైక్ పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.