ఖమ్మంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

KMM: జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల బీజేపీ జిల్లా నేతలు హార్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ..రాబోయే జనాభా లెక్కలలో కులగణన చేర్చాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కోన్నారు.