ఈద్గా మైదానం పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
ATP: అనంతపురం డ్రైవర్స్ కాలనీ ఈద్గా మైదానాన్ని అకాల వర్షం దెబ్బతీసింది. ముతవల్లిల సంఘం విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తక్షణమే స్పందించారు. అధికారులతో కలిసి మైదానాన్ని పరిశీలించి, నమాజుకు ఇబ్బంది లేకుండా గరసు మట్టితో చదును చేయాలని ఆదేశించారు. రూ.20 లక్షల వ్యయంతో బక్రీదు లోపు శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.