మేడారం అభివృద్ధి పనులు పూర్తి కావాలి: మోహన్ నాయక్

మేడారం అభివృద్ధి పనులు పూర్తి కావాలి: మోహన్ నాయక్

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను నిన్న ఆర్ అండ్ బి ఈఈ మోహన్ నాయక్ పరిశీలించారు. చేపట్టిన పనులను సవాలుగా స్వీకరించి, సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఈ నెల 10 లోపు పిల్లర్స్, గ్రానైట్ పనులను తప్పక పూర్తి చేయాలని ఈఈ ఆదేశించారు.