కనిగిరి రిజర్వాయర్‌ను పరిశీలించిన అధికారులు
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనిగిరి రిజర్వాయర్‌ను ఇరిగేషన్ ఎస్ ఈ దేశి నాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో మంజులతో కలిసి సందర్శించారు. కనిగిరి రిజర్వాయర్ నీటి సామర్థ్యంపై స్థానిక ఇరిగేషన్ అధికారులను ఆరా తీశారు. తుఫాను ప్రభావంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పర్యటకులను లోపలికి అనుమతించవద్దని సూచించారు.