తిరుమల లడ్డూపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
TPT: తిరుమల లడ్డూలపై జరిగిన అవకతవకలపై ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందించారు. 2019- 24 మధ్య తిరుమలకు వచ్చిన భక్తులను మోసం చేసినట్టు ఆరోపిస్తూ, ఐదేళ్లలో 20 కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని అన్నారు. భక్తుల విశ్వాసాన్ని తుంచేలా నిబంధనలు ఉల్లంఘించారని, మనం భక్తితో నమస్కరిస్తుంటే వారి హృదయాలను ముక్కలు చేశారని పవన్ వ్యాఖ్యానించారు.