మే 9న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్
KRNL: మే 9న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఇవాళ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు, మోటార్ యాక్సిడెంట్, బ్యాంక్, మున్సిపల్, తదితర కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.