చెన్నకేశవ స్వామి సన్నిధిలో మంత్రి బీసీ దంపతులు

చెన్నకేశవ స్వామి సన్నిధిలో మంత్రి బీసీ దంపతులు

NDL: అవుకులోని శ్రీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామిని శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సతీమణి బీసీ ఇందిరమ్మతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు. అంతకముందు టీడీపీ శ్రేణులు, ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.