ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
HNK: హాసన్ పర్తి మండల కేంద్రంలోని పెద్ద చెరువు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న విద్యార్థులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు స్థానంలోనే మృతి చెందారు. మృతులను సుప్రతిక మరియు అక్రమ్‌గా గుర్తించారు. వారు ఎస్.ఆర్ కాలేజ్ చెందిన విద్యార్థులుగా గుర్తించారు.