కాశీ మఠం స్వామీజీకి ప్రధాని నివాళి
వారణాసిలోని శ్రీ కాశీ మఠం సంస్థానానికి చెందిన శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది పురస్కరించుకుని PM మోదీ నివాళులర్పించారు. స్వామీజీ తన జీవితాన్ని మానవ సేవకు, ఆధ్యాత్మికతకు అంకితం చేశారని కొనియాడారు. విద్యా వ్యాప్తికై అనేక సంస్థలు, పరిశోధనా కేంద్రాలను నెలకొల్పిన ఆయన కృషిని స్మరించుకున్నారు. భారతీయ సంస్కృతి, విలువలను రక్షించడంలో ఆయన పాత్ర అద్వితీయమని ప్రశంసించారు.