కల్వర్టును ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

KDP: సిద్ధవటం మండలంలోని మాచుపల్లి-కడప రహదారి బండి కనుమపై మంగళవారం హిందూపురం నుండి బద్వేల్ గ్రామానికి చింతపండు రవాణా చేస్తున్న లారీ మలుపు వద్ద ఆటోను తప్పించబోయి కల్వర్టును ఢీకొంది. స్థానికులు జెసిబి యంత్రంతో రహదారికి అడ్డంగా ఉన్న లారీని తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. ప్రమాదాలు అరికట్టేందుకు అధికారులు చొరవ తీసుకొని విస్తరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.