' రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం'
KDP: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు వేంపల్లె 1వ సచివాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రధాని నరేంద్రమోదీ కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 21వ విడత నిధుల విడుదల చేశారని అన్నారు.