గాల్లో కలుస్తున్న విషపూరిత వ్యర్థాలు..!
MDCL: బాచుపల్లి ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ ఏరియాల్లో విషపూరిత వ్యర్థాలు గాల్లో కలుస్తున్నప్పటికీ, పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ విషపూరిత వ్యర్థాలతో ఊపిరితిత్తులు, చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని మొరపెట్టుకున్నప్పటికీ ఎవరు తమవైపు చూడడం లేదని పరిసర ప్రాంతాల ప్రజలు తమ గోడును వెలబుచ్చారు.