'మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలి'
PDPL: మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలని P.D (DRDO) కాలిందిని తెలిపారు. పెద్దపల్లిలో ఇవాళ RSETI ఆధ్వర్యంలో మహిళలకు మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. మగ్గం వర్క్ శిక్షణ ద్వారా మహిళలకు ఇంటి వద్దనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DRDO రవీందర్, ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ పాల్గొన్నారు.