వాటర్ హీటర్ పేలి.. స్వల్ప అగ్ని ప్రమాదం

వాటర్ హీటర్ పేలి.. స్వల్ప అగ్ని ప్రమాదం

NTR: గన్నవరంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గదిలో నివసిస్తున్న బ్యాచిలర్లు స్నానానికి నీళ్లు వేడి చేయడానికి వాటర్ హీటర్‌ను ఆన్ చేయగా.. అది పేలి మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించి గదిలోని సామాగ్రి పాక్షికంగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు గదిలో ఉన్నవారు అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.