BREAKING: యజమానిని కొరికి చంపిన కుక్క

BREAKING: యజమానిని కొరికి చంపిన కుక్క

TG: హైదరాబాద్ మధురానగర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. యజమానిని పెంపుడు కుక్క కొరికి చంపింది. యజమాని పవన్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని బాధితుడి స్నేహితుడు గుర్తించాడు. ఆ సమయంలో గదిలో ఉన్న పెంపుడు కుక్క నోటి నిండా రక్తం, పవన్ శరీర భాగాలను తిన్నట్లు ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని పంచనామా నిర్వహిస్తున్నారు.