ముస్లింలకు రంజాన్ కానుక పంపిణీ
NGKL: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని 12వ వార్డు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మేకల కిషోర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ మేకల శిరీష కిరణ్ యాదవ్ అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు వార్డులోని ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను వారు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.