వాడపల్లి వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

KKD: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు వేకువజాము నుంచే దర్శనాలు కల్పించారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేశారు.