VIDEO: ల్యాబ్ ఆన్ వీల్స్ స్కిల్ డెవలప్మెంట్ బస్‌ను ప్రారంభించిన కలెక్టర్

VIDEO: ల్యాబ్ ఆన్ వీల్స్ స్కిల్ డెవలప్మెంట్ బస్‌ను ప్రారంభించిన కలెక్టర్

ప్రకాశం జిల్లాలోని ఐటీఐ విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్‌లో శిక్షణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఇన్ఫోసిస్ ల్యాబ్ ఆన్ వీల్స్ బస్సును శనివారం కలెక్టర్ అన్సారియా ప్రారంభించారు. ఒంగోలు ఐటీఐ కళాశాల వద్ద బస్సును ప్రారంభించిన కలెక్టర్ అనంతరం లోపలకు వెళ్లి ఏయే అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తారో జిల్లా నైపుణ్యాభివృద్ధి‌ అధికారి రవితేజను అడిగితెలుసుకున్నారు.