రామతీర్థం కొండకు నిప్పు

ప్రకాశం: చీమకుర్తి మండలంలోని రామతీర్థంలో ఉన్న కొండకు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు. దీంతో కొండపై ఉన్న చెట్లన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇలా నిప్పు పెట్టడం వలన పక్షులకు, మూగజీవాలకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.