మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి

ATP: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు దాడి చేసిన ఘటన అనంతపురంలోని శారద నగర్‌లో జరిగింది. మద్యం దుకాణం వద్ద వేట కొడవలితో మునాఫ్‌పై మురళి దాడి చేసినట్లు వన్ టౌన్ సీఐ రాజేంద్ర ప్రసాద్ యాదవ్ తెలిపారు. బాధితుడు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.