బంగారు పతకాలు సాధించిన ఎఎస్ఐకు అభినందనలు
VZM: పట్టణంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఆల్తి త్రినాథరావు ఇటీవల విశాఖ వెలంపేట శ్రీ విజయేంద్ర వ్యాయామ మండలి పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు పథకాలు సాధించిన ఆయన జిల్లా ఎస్పీ దామోదర్‌ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.