కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
అన్నమయ్య: మదనపల్లి మండలంలో బుధవారం రాత్రి కారు ఢీకొని గౌసియా(45) అనే మహిళ తీవ్రంగా గాయపడింది. తురకపల్లి దర్గాలో ఉరుసు ఉత్సవం జరుగుతున్న సమయంలో దర్గా వద్దకు వెళ్ళడానికి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే ఆమెను మదనపల్లి జిల్లా ఆసుత్రి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.