ఎర్లీబర్డ్ స్కీమ్.. జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం

HYD: నగరంలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపు కోసం జీహెచ్ఎంసీ అమలు చేసిన ఎర్లీబర్డ్ పథకానికి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను చెల్లింపులో జీహెచ్ఎంసీకి రూ.900 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. 79 లక్షల మందికి పైగా ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.