పెరిగిన ఇంధన ధరలు.. విమాన ప్రయాణికులకు SHOCK

పెరిగిన ఇంధన ధరలు.. విమాన ప్రయాణికులకు SHOCK

యుద్ధం ప్రభావంతో విమాన ఇంధనం(ATF) ధరలు ఆకాశాన్ని తాకాయి. భారత్‌లో ఏవియేషన్ టర్బైన్ ఇంధన ధరలు ఏకంగా 115% పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఢిల్లీలో గతంలో కిలో లీటర్ ధర రూ.96,638 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.2.07Lకు చేరింది. ఇంధన ధరలు రెండింతలు పెరగడంతో విమాన ప్రయాణాలు సామాన్యులకు మరింత భారంగా మారనున్నాయి. చమురు సెగతో విమానయాన సంస్థలూ టికెట్ చార్జీలను పెంచే అవకాశం ఉంది.