కలెక్టరేట్‌లో మొక్కలు నాటిన కలెక్టర్

BPT: స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల కలెక్టరేట్ ఆవరణలో శనివారం 1,000 కొత్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ జె.వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. మొక్కలు నాటడం పర్యావరణ పరిరక్షణకు, పట్టణాన్ని మరింత సుందరంగా మార్చడానికి దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెరుగుతుందన్నారు.