VIDEO:ప్రలోభాలకు గురిచేసి ఏకగ్రీవం చేస్తే చర్యలు: డీఎస్పీ

VIDEO:ప్రలోభాలకు గురిచేసి ఏకగ్రీవం చేస్తే చర్యలు: డీఎస్పీ

MDK: ఎవరినైనా ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం ద్వారా ఏకగ్రీవాలు సాధించే ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ చెప్పారు. వెల్దుర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ వేలంపాటల ద్వారా పదవుల అమ్మకాలు జరిగితే కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భయపడకుండా నామినేషన్లు వేయాలని సూచించారు.