ఒంటరి జీవితంతో పెరుగుతున్న మానసిక వేదన..!
HYD: ఒంటరి జీవితంతో యువతలో మానసిక వేదన పెరుగుతోందని కాప్రా డాక్టర్ సువర్ణ తెలిపారు. గ్రేటర్ HYD పరిధిలో అనేకమంది యువత 34 ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ పెళ్లిళ్లు కాకపోవడం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నట్లుగా వివిధ సర్వేల్లో తెలిసినట్లు పేర్కొన్నారు. యుక్త వయసులో వృత్తి కోర్సులను ఎంచుకోవడం, కుటుంబంతో కలిసి ఉండటం మంచిదన్నారు.