అప్రమత్తంగా ఉన్నాం: తహసీల్దార్ ప్రసాద్

BDK: బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాలలో రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మండల అధికారులతో కలిసి బూర్గంపాడు మండలంలో పర్యటించారు. వరద ప్రాంతాలలో పర్యవేక్షణ చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.