ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ క్రికెట్ ప్రారంభం

అదిలాబాద్: నార్నూర్ మండల కేంద్రంలో ఈ రోజు ప్రీమియర్ లీగ్ సీజన్ రెండవ క్రికెట్ టోర్నమెంట్ను సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బానోత్ గజానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నేహ పూర్వక వాతావరణంలో పోటీలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. వేసవి కాలం కావున సమయపాలన పాటించాలని సూచించారు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని పేర్కొన్నారు.