మానసా దేవి ఆలయానికి గోల్డ్ కాంటా మిషన్ అందజేత
KNR: మానసా దేవి ఆలయానికి గోల్డ్ కాంటా వెయిట్ మిషన్‌ను గన్నేరువరం శాఖ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ.. భక్తులు బంగారు ఆభరణాల బరువును సులభంగా కొలిచేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఇండియన్ బ్యాంక్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.