పేద కుటుంబాన్ని దత్తత తీసుకున్న జేసీ

KKD: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన తునిలో పర్యటించారు. పట్టణంలోని ఈగలవారి వీధికి చెందిన ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని, వారి జీవన స్థితిగతులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రావు కూడా పాల్గొన్నారు.