VIDEO: నేడు రామచంద్రపురం బంద్‌కు జేఏసీ పిలుపు
కోనసీమ: రామచంద్రపురం బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి 60 కి.మీ దూరంలో ఉంటే.. కాకినాడకు కేవలం 30కి.మీ దూరం మాత్రమే ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ అవసరాల దృష్ట్యా రామచంద్రపురాన్ని కాకినాడలో కలపాలని కోరారు.