నిజాంసాగర్ కెనాల్లో పడి వ్యక్తి మృతి

నిజాంసాగర్ కెనాల్లో పడి వ్యక్తి మృతి

NZB: ఎడపల్లి మండలం జానకంపేట శివారులో నిజామాబాద్-బోధన్ ప్రధాన రహదారి పక్కన ఉన్న నిజాంసాగర్ కెనాల్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తన బైక్‌తో సహా కెనాల్‌లో పడి మృతి చెందాడు. మృతుడు రెంజల్ గ్రామానికి చెందిన గాండ్ల సతీష్(30)గా గుర్తించారు. మృతుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.