పేకాట శిబిరంపై దాడి.. ప్రధాన నిర్వాహకుడు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. ప్రధాన నిర్వాహకుడు అరెస్ట్

GNTR: తెనాలి రూరల్ PS పరిధిలో కంచర్లపాలెం వద్ద నిన్న రాత్రి పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ & పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి 5 మందిని అదుపులోకి తీసుకుని 5 సెల్ ఫోన్లు, 3 బైక్‌లు, రూ. 6,040 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ప్రధాన నిర్వాహకుడు పి. శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.