బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

VSP: భీమిలి ప్రాంతంలో 8 నెలల క్రితం వికలాంగురాలైన బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భీమిలి ప్రాంతంలో అమ్మమ్మ దగ్గర ఉన్న మైనర్‌ను బోరా ఎల్లారావు అత్యాచారం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టులో నేరం రుజువు కావడంతో తీర్పునిచ్చారు.