జామి: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లలిత కుమారి

విజయనగరం: శృంగవరపుకోట జామిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో శృంగవరపుకోట నియోజవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొన్నారు. ఈ రోజు జామి పంచాయతీ పరిధిలోని అప్పన్నదరపాలెం బ్రాహ్మణ వీధిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తనని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.