శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్‌లో 40 గేట్లు విడుదల

శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్‌లో 40 గేట్లు విడుదల

NZB: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో మంగళవారం రాత్రి 8 గంటలకు 40వ గేట్ ఓపెన్ చేశారు. మొత్తం 40 గేట్ల ద్వారా 3,75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగుల (80.5TMC) కాగా 1,088.50 అడుగుల(71.47TMC)కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.