VIDEO: అకాల వర్షం.. ప్రజలకు ఉపశమనం
KDP: గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు చల్లని కబురు అందించాడు. ఆదివారం జమ్మలమడుగులో మోస్తరు వర్షం కురిసింది. మైలవరం, కొండాపురం మండలాల్లో కూడా వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కొన్ని పంటలకు నష్టం కలిగించినా, భూగర్భ జలాలు పెరగడానికి, వేడి తగ్గడానికి ఉపయోగపడుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.